ధోనీ ఇన్నింగ్సే నా ఫేవరెట్​: డుప్లెసిస్​

‘జట్టులో దాదాపు 10ఏండ్లుగా నేను భాగమై ఉండడాన్ని అదృష్టంగా భావిస్తున్నా.  ఈ కాలంలో నాకు ఎన్నో అద్భుతమైన జ్ఞాపకాలు ఉన్నాయి. రెండు ఐపీఎల్ టైటిళ్లు గెలిచాం. చాంపియన్స్ లీగ్​ విజేతలుగా నిలిచాం. ఎన్నో అద్భుతమైన మ్యాచ్​లు ఆడాం. ఈ సందర్భంగా కొన్ని అపూర్వమైన వ్యక్తిగత ఇన్నింగ్స్​ను గుర్తు చేసుకుంటున్నా’ అని డుప్లెసిస్​ అన్నాడు. గతేడాది ఆర్​సీబీపై ధోనీ ఇన్నింగ్స్​తో పాటు 2013లో  పంజాబ్​పై రైనా చేసిన శతకాన్ని వివరించి, తనకు ఐపీఎల్​లో అవే ఫేవరెట్ ఇన్నింగ్స్​లు అని వీడియోలో పేర్కొన్నాడు.


గతేడాది ఐపీఎల్​లో ఆర్​సీబీతో మ్యాచ్​లో 162 పరుగుల లక్ష్యఛేదనలో చెన్నై ఓ దశలో 28 పరుగులకే 4వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడగా.. ఆ తర్వాత ధోనీ విశ్వరూపం చూపాడు. చివరి వరకు పోరాడి 48 బంతుల్లోనే 7సిక్సర్లు, ఐదు ఫోర్లతో 84 పరుగులు చేశాడు. చివరి ఓవర్లో విజయానికి 26పరుగులు చేయాల్సిన దశలో ధోనీ మూడు సిక్సులు, ఓ ఫోర్ కొట్టినా చివరికి ఓ పరుగు తేడాతో చెన్నై ఓడిపోవాల్సి వచ్చింది. కానీ మహేంద్రుడి పోరాటానికి మాత్రం అభిమానులు ఫిదా అయిపోయారు.