సూపర్‌ మార్కెట్‌ సీజ్‌ చేసిన అధికారులు

 నగరంలోని శ్రీనగర్‌ కాలనీలో గల సూపర్‌ మార్కెట్‌ను అధికారులు సీజ్‌ చేశారు. జీహెచ్‌ఎంసీ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం అధికారులు సూపర్‌ మార్కెట్‌ను సీజ్‌ చేశారు. భౌతిక దూరం పాటించకపోవడం, అదేవిధంగా సిబ్బంది మాస్కులను ధరించకపోవడం వంటి భద్రతా వైఫల్యాల కారణంగా అధికారులు సూపర్‌ మార్కెట్‌ సీజ్‌ చేశారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణకు ప్రజలు తప్పనిసరిగా భౌతికదూరం పాటించాల్సిందిగా ప్రభుత్వం పేర్కొంది. వినియోగదారులు భౌతికదూరం పాటించేలా దుకాణదారులే చర్యలు తీసుకోవాలని లేనియెడల కఠిన చర్యలు తీసుకోబడునని ప్రభుత్వం హెచ్చరించిన విషయం తెలిసిందే. అదేవిధంగా దుకాణం వద్ద శానిటైజేషన్‌ ఏర్పాట్లు చేయాలంది. నిబంధనలు అతిక్రమించిన దుకాణదారులపై అధికారులు చట్టపరంగా వరుసగా చర్యలు తీసుకుంటున్నారు.