క‌రోనా చికిత్స‌.. ఆ డ్ర‌గ్ హెల్త్‌వ‌ర్క‌ర్ల‌కు మాత్ర‌మే !

క‌రోనా వైర‌స్‌కు ఎటువంటి మందు లేదు. కానీ కోవిడ్‌19 రోగుల‌కు చికిత్స అందిస్తున్న వారి కోసం యాంటీ మ‌లేరియా డ్ర‌గ్ ప‌నిచేస్తున్న‌ట్లు ప్రాథమికంగా తెలుస్తోంది.  కోవిడ్‌19 వ్యాధితో బాధ‌ప‌డుతున్న వారికి సేవ‌లు చేస్తున్న హెల్త్ వ‌ర్క‌ర్లు హైడ్రాక్సీక్లోరోక్వైన్ మందును వాడ‌వ‌చ్చు అని ఐసీఎంఆర్ పేర్కొన్న‌ది.  ఇంట్లో క్వారెంటైన్ అయిన వ్య‌క్తి ప‌ట్ల కేర్ తీసుకుంటున్న వారు మాత్రమే ఈ మాత్ర‌ల‌ను వేసుకోవాల‌ని ఐసీఎంఆర్ సూచించింది. హెల్త్ వ‌ర్క‌ర్లు ప్రొఫిలాక్సిస్ అనే మందును కూడా వాడుకోవ‌చ్చు.   దేశ‌వ్యాప్తంగా కోవిడ్‌19 ప‌రీక్ష‌ల కోసం 12 ప‌రిశోధ‌న‌శాల‌లు అందుబాటులో ఉన్నాయ‌ని ఐసీఎంఆర్ డైర‌క్ట‌ర్ జ‌న‌ర‌ల్ బ‌ల్‌రాం భార్గ‌వ్ తెలిపారు.  దేశ‌వ్యాప్తంగా మొత్తం 19 రాష్ట్రాలు లాక్‌డౌన్ ప్ర‌క‌టించిన‌ట్లు ల‌వ్ అగ‌ర్వాల్ తెలిపారు. కొన్ని కేంద్ర పాలిత ప్రాంతాలు కొన్ని చోట్ల‌ లాక్‌డౌన్ ప్ర‌క‌టించాయి.  చైనా, కొరియా, ఇట‌లీ, స్పెయిన్ దేశాల్లో కోవిడ్ పేషెంట్లు అన్ని ర‌కాల మందులు వాడినా ఎటువంటి ప్ర‌యోజ‌నం జ‌ర‌గ‌లేదు. కానీ హైడ్రాక్సీక్లోరోక్వైన్ వాడిన హాస్ప‌ట‌ల్లో కొంత వ‌ర‌కు క‌రోనా దూకుడును త‌గ్గిన‌ట్లు కొన్ని అధ్య‌య‌నాల ద్వారా తెలుస్తోంది. క‌రోనా ప‌రీక్ష‌లు చేప‌ట్టే కిట్‌ల త‌యారీని వేగ‌వంతం చేసిన‌ట్లు బ‌ల్‌రాం తెలిపారు. పూణె ల్యాబ్‌లో ఆ ప్ర‌క్రియ జ‌రుగుతున్న‌ట్లు చెప్పారు.