పెళ్ళి వార్త‌ల‌ని కొట్టిపారేసిన దిల్ రాజు..!


టాలీవుడ్ బ‌డా నిర్మాత దిల్ రాజు(49) రెండో పెళ్ళి చేసుకున్న‌ట్టు కొద్ది రోజుల నుండి జోరుగా ప్ర‌చారం జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. 3 ఏళ్ల క్రితం దిల్ రాజు భార్య అనిత గుండెపోటుతో మ‌ర‌ణించారు. అప్ప‌టి నుండి సింగిల్‌గా ఉన్న దిల్ రాజు కుటుంబ స‌భ్యుల ఒత్తిడితో త‌న ఫ్యామిలీలోని  30 ఏళ్ళ అమ్మాయిని వివాహ‌మాడార‌ని చెప్పుకొచ్చారు. ప్రైవేట్ వేడుక‌గా జ‌రిగిన ఈ పెళ్ళిలో కేవ‌లం కుటుంబ స‌భ్యులు మాత్ర‌మే పాల్గొన్నార‌ని అన్నారు. అయితే ఈ వార్త వైర‌ల్ కావ‌డంతో విష‌యం దిల్ రాజు దృష్టికి వ‌చ్చింది. వెంట‌నే స్పందించిన ఆయ‌న ఈ వార్త కేవ‌లం  ఒక ప్రముఖ దినపత్రిక ప్రారంభించిన పుకార్లు మాత్రమేనని, నేను ఇంకా పెళ్ళి చేసుకోలేద‌ని చెప్పుకొచ్చారు. ఒక‌వేళ చేసుకునే ఉద్దేశ‌మే ఉంటే అధికారిక ప్రకటన చేస్తానని స్పష్టం చేశాడు. 


దిల్ రాజు నిర్మించిన జాను చిత్రం రీసెంట్‌గా ప్రేక్ష‌కుల ముందుకు రాగా, ఈ మూవీకి మిక్స్‌డ్ టాక్ ల‌భించింది. త‌మిళ సూప‌ర్ హిట్ చిత్రం 96కి రీమేక్‌గా జాను చిత్రం తెర‌కెక్కింది. ప్ర‌స్తుతం ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌ధాన పాత్ర‌లో పింక్ రీమేక్ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. వేణు శ్రీరామ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రం స‌మ్మ‌ర్‌లో రిలీజ్ కానున్న‌ట్టు స‌మాచారం.